భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఎన్టీటీపీఎస్(నార్ల తాతారావు థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం) నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ కాలుష్యం, స్థానిక ప్రజల జీవనోపాధిపై ప్రభావాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు.

'ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఎన్టీటీపీఎస్‌లో మరమత్తులు చేపడుతున్నాం. పాండ్ యాష్ అక్రమ నిల్వ చేసి, తరలిస్తున్న కారణంగా స్థానికంగా కాలుష్యం జరిగేది. పీసీబీ సూచనల ప్రకారం బూడిద తరలింపుకు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించింది.' అని మంత్రి గొట్టిపాటి తెలిపారు.

కాలుష్యానికి చెక్ పెట్టేందుకు...