భారతదేశం, జూలై 21 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(NTRUHS) తీపి కబురు అందించింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు మెడికల్ కాలేజీల్లో 17 నూతన అలైడ్, హెల్త్‌కేర్ ప్రొఫెషన్ కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్(NCAHP) ఆమోదించిన ఈ కోర్సుల పరిచయంపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. అర్హులైన అధ్యాపకుల లభ్యత, మౌలిక వసతులు, నిబంధనల అమలుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.

రేడియోగ్రఫీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వంటి డిమాండ్ ఉన్న పారా...