భారతదేశం, మే 4 -- దక్షిణ భారత రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు ఉన్న పవర్‌ను విజయ్ మరోసారి నిరూపించారు. సొంత పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఇప్పటివరకు కేవలం ఎన్టీఆర్ పేరు మీదనే ఉంది. ఇప్పుడు విజయ్ ఆ రికార్డుకు చేరువయ్యారు.

తమిళనాడులో నటుడిగా, రాజకీయ నాయకుడిగా వెలుగొందిన ఎం.జి. రామచంద్రన్ (MGR) కూడా ఇంత వేగంగా సక్సెస్ సాధించలేదు. ఆయన 1972లో ఏఐఏడీఎంకే (AIADMK) స్థాపించినప్పటికీ, అధికారంలోకి రావడానికి ఐదేళ్లు పట్టింది (1977). విజయ్ మాత్రం అంతకంటే తక్కువ సమయంలోనే 'తమిళనాడు కింగ్' అనిపించుకుంటున్నారు.

సినిమా పాపులారిటీ ఎప్పుడూ ఓట్లుగా మారదు అనడానికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ విజయం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

చిరంజీవి, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు చేయలేనిది విజయ్ ఎలా చేయగలిగారు?...