భారతదేశం, నవంబర్ 26 -- ఎనిమిదో కేంద్ర వేతన సంఘం ముందు ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు, రక్షణ రంగ సమాఖ్యలు కీలక డిమాండ్లను ఉంచాయి. పెన్షన్ల పెంపు, కనీస పెన్షన్ రూ. 45 వేలు, తరచూ డీఏ/డీఆర్ సవరణలు, 2026 జనవరి 1కి ముందు పదవీ విరమణ చేసిన వారినీ పెన్షన్ సవరణ పరిధిలోకి తీసుకురావడం వంటి ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వేతనాలు, పెన్షన్లలో భారీ పెంపుతో పాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మార్పులు, మెరుగైన అలవెన్సులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని వివిధ సంఘాలు విజ్ఞప్తులు సమర్పిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణాలను ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాలు సమీక్షిస్తాయి. ఏడో వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు, విధివిధానాలపై విస్తృత చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల డిమాండ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

245 అనుబం...