ఎనర్జీ సెక్టార్లో కనువిందు చేస్తున్న భారీ చాన్స్.. మదుపరులకు ఇది పండగే
భారతదేశం, సెప్టెంబర్ 8 -- భారతదేశ విద్యుత్తు రంగం దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడుల చక్రంలోకి అడుగుపెడుతోంది. గతంలో మాదిరిగా ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న మార్పు చాలా విస్తృతమైనది, అత్యంత లోతైనది. పెరిగిన విద్యుత్ డిమాండ్, స్వచ్ఛమైన ఇంధనం (Clean Energy) వైపు వేగంగా మళ్లుతున్న అడుగులు, వీటితో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను (Transmission & Distribution - T&D) బలోపేతం చేయాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ రంగాన్ని పరుగులు తీస్తున్నాయ్.
ఇటీవల జరిగిన 'భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026'లో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక సంచలన విషయాన్ని అంచనా వేసింది. రాబోయే రెండు దశాబ్దాల్లో దేశీయ విద్యుత్ రంగానికి ఏకంగా రూ.200 లక్షల కోట్ల (సుమారు 2 ట్రిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరమవుతాయని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.