భారతదేశం, జూన్ 16 -- Serial Actor Krishna Koushik On Telugu Actors And Producers:

సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై మెగా సీరియల్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కృష్ణ కౌశిక్. ఒకప్పటి హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య అన్న అయిన కృష్ణ కౌశిక్ దాదాపుగా 45 సీరియల్స్ చేస్తే అందులో 18లో మెయిన్ లీడ్‌గా చేసి అలరించాడు.

36 వేలకుపైగా ఎపిసోడ్స్‌లో కనిపించిన కృష్ణ కౌశిక్ నటుడిగానే కాకుండా టెలివిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశాడు. ఎన్నో ఏళ్లుగా తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలంటూ గళం విప్పుతున్న కృష్ణ కౌశిక్ ఇటీవల యాంకర్ గాయత్రి భార్గవి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయం, నాన్ తెలుగు ఆర్టిస్ట్‌లు ఎక్కువైపోవడం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. అయితే, నెల క్రితం జర...