భారతదేశం, నవంబర్ 5 -- దేశంలో విద్యా వ్యవస్థను మరింత ఆచరణాత్మకంగా, నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ) విప్లవాత్మక అడుగులు వేసింది. కొత్తగా రూపొందించిన 9వ తరగతి సోషల్ సైన్స్ (ఎకనామిక్స్) పార్ట్-2 పాఠ్యపుస్తకంలో 'పర్సనల్ ఫైనాన్స్' (వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ), 'ఎంటర్‌ప్రెన్యూర్ షిప్' (వ్యాపార వ్యవస్థాపకత) అధ్యాయాలను అధికారికంగా చేర్చింది.

విద్యార్థుల్లో చిన్నతనం నుంచే డబ్బు ప్రాముఖ్యత, పొదుపు, పెట్టుబడులు, స్వయం ఉపాధిపై అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. అంతేకాకుండా స్టేట్ సిలబస్‌లలో కూడా ఎన్‌సీఈఆర్‌టీ మార్గ...