భారతదేశం, ఏప్రిల్ 17 -- Hyderabad Real Estate : హైదరాబాద్‌లో రూ. 2 కోట్ల పైబడిన ఫ్లాట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ఈ ధరలకు కేంద్రబిందువుగా మారింది. అయితే కొత్త లాంచ్‌లలో ఉన్న జోరు రీసేల్ మార్కెట్‌లో లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటివి ఇన్వెస్టర్లను, గృహ కొనుగోలుదారులను కలవరపెడుతున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు ఏకంగా 46శాతం పడిపోవడం మార్కెట్ మందగమనానికి సంకేతంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా రెడిట్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో నెటిజన్లు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. "హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ. 8,000 నుంచి రూ. 12,000 వసూలు చేస్తున్నారు. కానీ, వర్షం వస్తే ఆ రోడ్లపై నడవగలమా? డ్రైనేజీ వ్యవస్...