భారతదేశం, మే 23 -- Summer Hydration Mistakes : భానుడి భగభగలకు ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఈ ముదురుటెండలు శరీరంలో వేడిని విపరీతంగా పెంచేస్తున్నాయి. ఫలితంగా ఒళ్లంతా చెమటలు పట్టి శరీరం త్వరగా డిహైడ్రేషన్‌కు గురవుతోంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, శరీరాన్ని రీహైడ్రేట్ చేయడమంటే కేవలం లీటర్ల కొద్దీ నీళ్లు తాగేయడం మాత్రమే కాదు.

చాలామంది ఎండ తీవ్రతకు భయపడి కేవలం సాధారణ నీటిని మాత్రమే ఎక్కువగా తాగుతుంటారు. అయినప్పటికీ దాహం తీరకపోగా.. నీరసం, తలనొప్పి అలాగే ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఉమంగ్ వివరించారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 90 శాతం మంది నీళ్లు తాగేటప్పుడు 4 రకాల పెద్ద తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏమిటి? ఎండ దెబ్బ నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ఆయుర్వేదం చెబుతున్న సూత్రాలెంటో ఇక...