భారతదేశం, జూలై 10 -- శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల ఊబకాయం (అధిక బరువు) నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. అయితే, బరువు పెరగడం అంటే కేవలం బాహ్య రూపం మారడం, ముఖంపై ముడతలు రావడం మాత్రమే కాదు.. మన శరీరంలోని కీలక అవయవాలు కూడా వయసు కంటే ముందే ముసలివైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు నేరుగా గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తూ, దాని వయసును వేగంగా పెంచేస్తోంది.

అధిక బరువు గుండెను ఎలా దెబ్బతీస్తుందో ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ కుమార్ జైన్ వివరించారు. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కంటే ఎక్కువ బరువు ఉండటం అనేది కేవలం అదనపు బరువుకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, అది గుండెను నిరంతరం ఒత్తిడికి గురిచేసే ఒక తీవ్రమైన ఆరోగ్య ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు.

"శరీరంలో పేరు...