భారతదేశం, సెప్టెంబర్ 30 -- భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. భారీ ఇన్ ఫ్లోతో 48.8 అడుగులకు చేరుకుంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదావరిలో స్నానాలకు, పడవ ప్రయాణానికి నిషేధం విధించారు. వరద బాధిత గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ పాటిల్ కోరారు.

తెల్లవారుజామున 3.30 గంటలకు నీటి మట్టం 48 అడుగుల మార్కును దాటింది. ఉదయం 8 గంటలకు నది 48.80 అడుగుల వద్ద ప్రవహించింది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున, వరద ప్రభావిత గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. అవసరమైతే మరిన్ని సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సహాయ కేంద్రాలలో త...