భారతదేశం, సెప్టెంబర్ 3 -- గ్లోబల్ రైడ్-షేరింగ్, డెలివరీ దిగ్గజం ఉబెర్ (Uber) సంస్థలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3,300 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. సంస్థలో అంతర్గత నిర్వహణ పొరలను (Layers) తగ్గించి, బృందాల నిర్మాణాన్ని సరళతరం చేయడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు. స్థానిక చట్టపరమైన నిబంధనలు ఉన్న దేశాల్లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బాధితులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో ఉబర్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. కంపెనీ రాబడి దాదాపు మూడు రెట్లు పెరిగినప్పటికీ, ఆ వృద్ధితో పాటు సంస్థలో ఆర్గనైజేషనల్ స...