భారతదేశం, సెప్టెంబర్ 15 -- హార్ట్‌ బీట్‌ను సరిగా ఉంచేందుకు అవసరమైన క్యాల్షియం స్థాయిలపై కూడా ఉప్పు దుష్ప్రభావం చూపిస్తుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ సమీర్ పగాడ్ పేర్కొన్నారు. ముంబై నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సమీర్ పగాడ్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఉప్పు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెప్పారు. అధిక సోడియం డైట్ గుండె కండరాల పనితీరును దెబ్బతీస్తుందని, తద్వారా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయగల సామర్థ్యం తగ్గుతుందని వివరించారు.

ఉప్పు గుండె గోడలను మందంగా మారుస్తుందని, దీనివల్ల 'లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్‌ట్రోఫీ' అనే సమస్య వస్తుందని డాక్టర్ పగాడ్ వెల్లడించారు. ఈ సమస్య ముదిరితే, గుండె రక్తా...