భారతదేశం, డిసెంబర్ 12 -- ఈనెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి- మెస్సీతో ఉప్పల్‌ మైదానంలో మెస్సీ- గోట్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మ్యాచ్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పోలీసులు కీలక ప్రకటన చేశారు.

టికెట్ లేదా పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని. పాస్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీపీ తెలిపారు. దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో. మ్యాచ్ కోసం భ...