భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. బుధవారం అంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల వానలు పడ్డాయి.

బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

బుధ, గురువారాల్లో ఏలూరు, అల్లురి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల,...