భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దంచికొడుతుండగా.. మరికొన్ని ప్రదేశాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రల్లోని పలు జిల్లాల్లో వానలు పడనున్నాయి.

దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఐఎండీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది.

నేడు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో మోస్తరు ను...