Andhrapradesh,telangana, సెప్టెంబర్ 21 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలుండగా. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(సెప్టెంబర్ 22) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, ...