భారతదేశం, జూలై 27 -- హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ కంపెనీలు, సంస్థలు విడతల వారీగా కార్యాలయాల నుంచి ఉద్యోగులను ముందుగానే పంపాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.

'నగరంలో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఐటీ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను విడతల వారీగా ముందుగానే ఆఫీసు నుంచి వెళ్లేందుకు అనుమతించాలి.' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ జారీ చేశారు.

రహదారి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గించడం, ప్రయాణ సంబంధిత ప్రమాదాలను స్థాయికి తగ్గ...