భారతదేశం, మార్చి 19 -- లండన్/న్యూయార్క్: టెక్నాలజీ పెరుగుతుంటే ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన ఇప్పుడు నిజమవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ (HSBC) తన పనితీరును పూర్తిగా ఆధునీకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొన్నేళ్లలో ఏకంగా 20,000 మంది ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యతను పెంచుతూ, మానవ వనరుల వినియోగాన్ని తగ్గించుకోవడమే ఈ భారీ కోతకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జార్జెస్ ఎల్హెడెరీ నేతృత్వంలో ఈ ప్రక్షాళన జరగనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, సంస్థలోని మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితం కానున్నారు. 2025 చివరి నాటికి హెచ్‌ఎస్‌బీసీలో సుమారు 2,10,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా మార్ప...