భారతదేశం, జూన్ 25 -- అనేక కంపెనీలు ఉద్యోగాల కోతలు చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ నిర్ణయాలు ఎలాంటి అలర్ట్ లేకుండా వచ్చేస్తాయి. ఆకస్మాత్తుగా ఏదో మెయిల్ వచ్చి.. మరుసటి రోజు నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తారు. అప్పుడు ఉద్యోగి మానసిక వేదన దారుణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్థిరమైన మనస్సును కలిగి ఉండటం, అర్థవంతమైన ఆలోచన చేయడం ముఖ్యం. మీరు అనుభవించే భావోద్వేగాల నుంచి బయటపడాలి..

ఉద్యోగం కోల్పోయిన తర్వాత తర్వాత ఏం చేయాలో అని ఆందోళన చెందడం సహజం. కానీ ముందుగా మీరు అనుభవిస్తున్న విచారం, నిరాశ లేదా కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఇది మీ తప్పు కాదు.. ఇది మార్పులో భాగం. ఉద్యోగ తొలగింపునకు దారితీసే అనేక అంశాలు ఉండవచ్చు. ఆర్థిక సంక్షోభం, కంపెనీ పునర్నిర్మాణం, సాంకేతిక మార్పు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. ఉద...