భారతదేశం, నవంబర్ 3 -- విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఒక తెలుగు యువకుడు దారుణ మోసానికి గురయ్యాడు. పండ్లను ప్యాకింగ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఏజెంట్లు.. అతడిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించి ఉక్రెయిన్ యుద్ద ప్రాంగణానికి పంపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితుడిని విశాఖపట్నానికి చెందిన జె. వంశీగా గుర్తించారు. తన కుమారుడు యుద్ధ భూమిలో ప్రాణభయంతో అల్లాడుతున్నాడని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని అతడిని సురక్షితంగా భారతదేశానికి రప్పించాలని అతడి తల్లి జె. అప్పలకొండ కన్నీరుమున్నీరవుతోంది.

విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అప్పలకొండ తన ఆవేదనను పంచుకున్నారు. "నా కుమారుడు వంశీ పండ్ల ప్యాకింగ్ కంపెనీలో పనిచేసేందుకు రష్యా వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చెప్పిన ఉద్యోగం దొరకలేదు. ఆ సమయంలోనే ఒక...