భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇవాళ రాత్రి లేదా రేపటికి దాదాపు రెండవ హెచ్చరిక స్ఠాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 44.5 అడుగులు ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి హెచ్చరిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇవాళ దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో అధికారులు కంట్రోల్ రూ...