Telanagna,andhrapradesh, ఆగస్టు 19 -- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో4.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరిలో క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 36.6అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 8.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లే ...