భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. వారానికి ఒకసారి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఉచితంగా అందిస్తారు. పుస్తకాలు, ఇండోర్ క్రీడల కోసం కొన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కేంద్రాలను నడపడానికి మార్గదర్శకాలను రూపొందించారు.

ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 12న ప్రారంభించిన విషయం తెలిసిందే. వృద్ధులలో సామాజిక సంబంధాలను ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ డే కేర్ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఒంటరితనంతో కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్లకు ఈ ప్రణామ్ డే కేర్ కేంద్రాలు ఎంతగానో ఉపశమనం కలిగించనున్నాయి. కన్నబిడ...