భారతదేశం, జూన్ 12 -- మన హిందూ సాంప్రదాయంలో ఉదయం లేవగానే సానుకూల ఆలోచనలతో రోజును మొదలుపెట్టడం, భగవంతుని ప్రార్థించడం ఆనవాయితీ. అలాగే, ఉదయం లేవగానే మొదట కరదర్శనం చేసుకోవాలని పెద్దలు అంటారు. అంటే, ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకోవాలి. అయితే ఎందుకు ఇలా చేయాలి? పూర్వకాలం నుంచి ఎందుకు ఇలా పాటిస్తున్నారు? ఇది ఒక ఆచారమేనా? దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే కరదర్శనం చేసుకోవడం చాలా మంచిది.

నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటూ,

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।

కరమూలే స్థితో గోవిందః ప్రభాతే కరదర్శనం॥

ఈ శ్లోకం చదువుకుంటూ కరదర్శనం చేసుకోవాలి.

అరచేతి అగ్ర భాగంలో, అంటే వేళ్ల చివర లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూల భాగంలో గోవిందుడు నివసిస్తారని విశ్వసిస్తారు. కనుక ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవడం వల్ల సం...