భారతదేశం, ఫిబ్రవరి 12 -- రెండు నెలలకు పైగా ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలకు, అలాగే తెలంగాణ అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఓ పెద్దపులి. అయితే ఇది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ నుంచి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ పులి తిపేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చింది కాదు.

మహారాష్ట్ర అటవీ అధికారులు పెద్దపులి తిప్పేశ్వర్ నుండి వచ్చినది కాదని నిర్ధారించారు. పులి చిత్రాన్ని.. తమ దగ్గర ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చారు. ఇది ఇక్కడి నుండి వెళ్లిందని కాదని.. అని తిప్పేశ్వర్ అభయారణ్యం పరిధిలోకి వచ్చే మెల్‌ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ ఆదర్శ్ అన్నారు.

తడోబా-అంధారి టైగర్ రిజర్వ్, దాని పరిసరాల నుండి వచ్చిన పెద్ద పులితో ఇది సరిపోతుందో లేదో చూడటానికి దీని చిత్రాన్ని చంద్రపూర్ అటవీ అధికారులకు పంపారు. చంద్రపూర్ జిల్లాలో పులుల అ...