భారతదేశం, ఆగస్టు 5 -- Warangal Cancer Hospital : ఉత్తర తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని వారి ఇంటి గుమ్మం వద్దకే చేర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నిమ్స్ తరహాలోనే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సమీప జిల్లాల ప్రజలకు అత్యాధునిక కేన్సర్ చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా ఈ రీజనల్ కేన్సర్ సెంటర్‌ను తీర్చిదిద్దనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్, హన్...