భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు వారికి పార్టీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చిన్న శ్రీను రాకతో ఉత్తరాంధ్రలో టీడీపీ మరింత బలపడనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీ బలోపేతానికి మజ్జి శ్రీనివాసరావు కీలక భూమిక పోషించారు. మాజీ మంత్రి ...