భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం సాకారమైంది. గోదావరి జలాలు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర నేలను స్పృశించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని క్రాస్ రెగ్యులేటర్ మీట నొక్కి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు.

అనకాపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం, నీటి ప్రవాహ తీరును పరిశీలించారు. అనంతరం పాయకరావుపేట చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక కళాకారులు సంప్రదాయ కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

గోదావరి జలాల రాకకు సూచికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఓపెన్ టాప్ జీపు...