భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ మైన్ కెనాల్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుధవారం) విడుదల చేయనున్నారు. పాయకరావుపేట వద్ద నిర్మించిన రెగ్యులేటర్‌ను ఆన్ చేసి... గోదావరి తల్లికి 'జల హారతి' ఇచ్చి స్వాగతం పలకనున్నారు.

ఈ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదలతో ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో ప్రయోజనం చేకూరనుంది. వివిధ ఆయకట్టుల పరిధిలో మొత్తం 2,87,320 ఎకరాలకు నిలకడైన సాగునీరు అందడమే కాకుండా, దాదాపు 5.23 లక్షల మంది జనాభాకు తాగునీటి ఎద్దడి తీరుతుంది. పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ నీరు ఎంతో దోహదపడనుంది.

పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 4,192 కోట్లు వ్యయం చేసింది. ఈ కాలువ నిర్మాణం ఏమాత్రం సాధారణమైనది కాదు. త...