Andhrapradesh, ఆగస్టు 17 -- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ (స్త్రీ శక్తి) విజయవంతంగా పట్టాలెక్కింది. ఈ పథకం ప్రారంభించిన తొలి 30 గంటల్లోనే 12 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లందరికీ ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని ఈ పథకం అందిస్తుంది.

'స్త్రీశక్తి' అమలు చేసిన తొలిరోజే లబ్ధిదారులకు రూ.5 కోట్ల వరకు ఆదా అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ కోసం ప్రతి ఏటా రూ.1,942 కోట్లు, నెలకు రూ.162 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు...