Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆర్టీసీ ఉచిత బస్స...