భారతదేశం, మార్చి 12 -- మరి కొన్ని రోజుల్లో కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో విజయాలు కలగాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది రాక ముందు ఇంటికి వీటిని తెచ్చి పెట్టుకోండి. వీటిని ఇంటికి తెచ్చి పెట్టడం వలన ధనం కలుగుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంకా ఎన్నో లాభాలను పొందడానికి కూడా వీలవుతుంది. ఉగాదికి ముందు ఇంటికి తెచ్చుకోవాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి ఆకులను తీసుకువచ్చి తోరణాలుగా చేసి ఇంటి ముఖద్వారానికి కట్టండి. మామిడి ఆకులను ఇంటికి కట్టడం వలన దుష్ట శక్తులు రావు. అలాగే సంపద కూడా పెరుగుతుంది.

వేప ఆకులు, వేప పువ్వును ఇంటికి తెచ్చుకోండి. ఉగాది పచ్చడిలో వేప పువ్వును వాడుతాము. అలాగే వేప అన్నిటినీ స్వచ్ఛంగా మారుస్తుందని నమ్మకం....