ఈ 7 పరిమితులు దాటితే మీకు ఇన్కం టాక్స్ నోటీసులు తప్పవు
భారతదేశం, జూలై 7 -- ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) గడువులోగా దాఖలు చేస్తే బాధ్యత తీరిపోయిందని అనుకుంటే పొరపాటే. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. నగదు లావాదేవీలు, అధిక విలువైన ఆర్థిక లావాదేవీలపై కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. ఈ నిబంధనలను దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు, భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నల్లధనం, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కఠినమైన నియమాలను అమలు చేస్తోంది. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఇల్లు కొంటున్నా లేదా ఎవరికైనా నగదు రూపంలో డబ్బులు ఇస్తున్నా ఈ కింద పేర్కొన్న ఏడు పరిమితులను గుర్తుంచుకోవడం ఎంతో అవసరం.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం.. ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో, ఒకే లావాదేవీకి లేదా ఒకే సందర్భానికి సంబంధించి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోకూడదు. ఈ నిబంధనన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.