భారతదేశం, సెప్టెంబర్ 3 -- మనిషి జీవితాన్ని విజయపథంలో నడిపించడానికి ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల ప్రవర్తన మారుతున్నప్పటికీ, చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో పొందుపరిచిన మానవ స్వభావ విశ్లేషణ మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. అందుకే నేటికీ ఎంతోమంది తమ నిత్య జీవితంలో చాణక్య సూత్రాలను ఆచరించి ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నారు. చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం 'మౌనం' అనేది మనిషికి అతిపెద్ద అస్త్రం మాత్రమే కాదు, అత్యుత్తమ ఆభరణం కూడా.

జీవితంలో ప్రతీచోటా మన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నోరు మూసుకుని ఉండటమే గొప్ప పరిపక్వతకు నిదర్శనం. అకారణంగా తలెత్తే వివాదాలు, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఏయే సమయాల్లో మౌనం పాటించాలో చాణక్యుడు స్పష్టంగా వివ...