భారతదేశం, జూలై 27 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను అంచనా వేయొచ్చు. ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు కొన్నిట్లో ఆరితేరి ఉంటే, అదే కొన్ని రాశుల వారికి బలహీనతలు కావచ్చు.

మహిళల్లో కూడా చాలా మంది మరి కొంత మందితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. కొందరు మహిళల్లో ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. కొన్ని రాశుల మహిళలు ధైర్యంగా ఉంటారు. ఇంకొంత మంది అంత ధైర్యంగా ఉండలేరు. కొంత మందికి ఓర్పు, శాంతి ఎక్కువ. ఏదైనా కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాలలో ఇబ్బందులు వంటివి ఎదురైతే, కొంతమంది చాలా కుమిలిపోతారు. మరికొంతమంది మాత్రం ప్రశాంతంగా వాటిని ఎదుర్కోగలరు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఓపిక, ప్రశాంతతకు మారుపేరుగా ని...