భారతదేశం, మే 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో అశుభ యోగాలను, శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కేతువు నీడ గ్రహం. కేతువు సంచారంలో మార్పు వస్తే ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మే 29, శుక్రవారం నాడు కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ఉదయం 10:16కి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కేతువు జూన్ 30 వరకు మఖ నక్షత్రం మూడవ పాదంలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత రెండో పాదంలోకి అడుగుపెడతాడు.

కేతువు తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ దశను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. మఖా నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. అయితే కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టాలు వస్తాయి. మరి ఆ దురదృ...