భారతదేశం, ఆగస్టు 11 -- మన దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15, 1947న, సుదీర్ఘ పోరాటం తర్వాత భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పిస్తున్నాం.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటాయి. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రసంగాలు చేస్తారు. ఈసారి మీ ఇండిపెండెన్స్ డే స్పీచ్‌ను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ఇక్కడ కొన్ని మంచి ఐడియాలు ఉన్నాయి.

సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో మన దేశం అనుభవించిన కష్టాలు, పోరాటాల గురించి వివరించవచ్చు.

ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, జైళ్లలో చిత్రహ...