Andhrapradesh,nellore, జూలై 31 -- వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న జగన్‌. ముందుగా జైలు దగ్గరకు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లిడిన వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారని జగన్ ఆరోపించారు. అసలు ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందు...