భారతదేశం, నవంబర్ 5 -- రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ శుక్రవారం (నవంబర్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 5) మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీ, రష్మిక, ఇతర అంశాలపైనా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక నటనకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని అల్లు అరవింద్ అనడం విశేషం. తమ బ్యానర్ తో రష్మికకు మంచి అనుబంధం ఉందని చెప్పిన అరవింద్.. ఈ సినిమాకు ఆమె నేషనల్ అవార్డు అందుకుంటుందని, ఆ సెర్మనీకి తాను కూడా వెళ్తానని చెప్పాడు.

ఇక ఈ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని అతడు ఆకాశానికెత్తాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని అన్నా...