భారతదేశం, ఆగస్టు 11 -- విదేశీ భక్తులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత ఈ వీసా కలిగిన విదేశీయులు నేరుగా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉన్న అధికారిక విమానాశ్రయాల జాబితాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తిరుపతితో పాటు భోపాల్ విమానాశ్రయాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.

దీంతో దేశంలో ఈ-వీసా ద్వారా ప్రవేశించగల పోర్టుల సంఖ్య 88కి చేరింది. వీటిలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు (సీపోర్టులు), 13 లాండ్ (సరిహద్దు) పోర్టులు ఉన్నాయి.

కేంద్రం నిర్ణయంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ.. తిరుపతి విమానాశ్రయాన్ని విదేశీ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. అయితే ఇక్కడి నుంచి క్రమబద్ధమైన అంతర...