భారతదేశం, డిసెంబర్ 31 -- 2026 నూతన సంవత్సర స్కామ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ ద్వారా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. మీ బ్యాంక్ ఖాతాను తుడిచిపెట్టేందుకు చూస్తున్నారు. సైబర్ నేరస్థులు ఈ స్కామ్‌ను ఉపయోగించి మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను దొంగిలించవచ్చు. యూజర్ల ప్రైవసీ దెబ్బతినవచ్చు. మోసగాళ్లు మీ ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ సైబర్ నేరస్థులు హ్యాపీ న్యూ ఇయర్ స్కామ్ ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ జరుగుతోంది. యూజర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డులను పంపిస్తారు. ఇందులో లింక్ ఉంటుంది. వాటిని క్లిక్ చేస్తే మాల్‌వేర్ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మీ ఖాతాలో మనీ ఖాళీ అయినట్టే.

అంతేకాదు మీ పేరుతో అందమైన న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ క్...