భారతదేశం, ఫిబ్రవరి 27 -- శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఎదుర్కోక తప్పదు. చాలా మంది శని అనుగ్రహం కలగడానికి రకరకాల పరిహారాలను పాటిస్తారు. ముఖ్యంగా శనివారం నాడు శనికి సంబంధించిన పరిహారాలను పాటించడానికి మనం చూస్తూ ఉంటాం. శని అనుగ్రహం పొందడం అంత ఈజీ కాదు. కానీ ఈ రోజుల్లో జన్మించిన వ్యక్తులు మాత్రం శనిదేవుని దయతో ఎల్లప్పుడూ అనుగ్రహంగా ఉంటారు. కష్టపడితే విజయం సాధిస్తారు.

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు.

రాడిక్స్ సంఖ్య 9 వారు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల దయతో ఉ...