భారతదేశం, జూలై 1 -- ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తుల హాజరుకానున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ట్రైన్ నెం.12713/12714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు కొత్తగా హాల్టింగ్ ఇచ్చింది. 01.07.2026 నుండి 03.07.2026 వరకు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్‌లో తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేశారు. 12713 ట్రైన్ ఎర్రుపాలెం స్టేషన్‌కు 07.05కి వచ్చి.. 07.06కి బయల్దేరుతుంది. 12714 ట్రైన్ రాత్రి 9.22 గంటలకు చేరుకుని.. 09.23కి బయల్దేరి వెళ్తుంది.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో కొలువై ఉన్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. నిత్యం వేలాది మంది భక్తులతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వం...