భారతదేశం, ఏప్రిల్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ మేధస్సు, జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బుద్ధికి, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు అధిపతి అయిన బుధుడు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల మార్కెట్ రంగం నుంచి సామాన్యుల ఆలోచనా విధానం వరకు అన్నింటా మార్పులు వస్తాయి. ఏప్రిల్ 11వ తేదీన బుధ గ్రహం కుంభ రాశిని వీడి మీన రాశిలోకి ప్రవేశించనుంది.

మీన రాశి జల తత్వానికి ప్రతీక. ఇది భావోద్వేగాలు, ఊహలకు సంకేతం. బుధుడు సాధారణంగా తర్కానికి (Logic) ప్రాధాన్యం ఇస్తాడు. అయితే మీనంలో బుధుడు నీచ స్థితికి చేరుకుంటాడు, దీని వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం (Confusion) ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, అంటే రచయితలు, కళాకారులు, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సంచారం వల్ల ప్రధానంగా ...