భారతదేశం, జూన్ 4 -- మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు జూన్ 4న చంద్రుడు తన రాశిని మార్పు చేశాడు. చంద్రుడు తులా రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు.

ఈరోజు ఉదయం 7:42కి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడింది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మేష రాశి వారికి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. జీవితంలో అనుకున్న వాటిని సక...