భారతదేశం, సెప్టెంబర్ 8 -- ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే, ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన పరిహారాల గురించి చూద్దాం.

భారతీయ వంటగదిలో యాలకులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. టీ నుంచి మిఠాయిల వరకు చాలా రకాల వంటకాల్లో యాలకులను వాడతారు. అయితే, వంటలకే పరిమితం కాదు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కూడా ఈ యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులు సానుకూల శక్తిని పెంపొందించడానికి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి కూడా సహాయం చేస్తాయి.

అందుకే జేబులో లేదా పర్సులో యాలకులను పెట్టుకుంటే మనిషికి శుక్ర, బుధ గ్రహాల అనుగ్రహం. ఆకుపచ్చని యాలకులను శుక్రుడు, బుధ గ్రహాలకు కారకులు అని చెప్తారు. భోగభాగ్యాలు, ఐశ్వర్యాన్ని అందించే శుక్రుడు, బ...