Telangana,medaram, సెప్టెంబర్ 21 -- ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు.

మేడారం అభివృద్ధి ప్రణాళికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో కలిసి సమీక్షించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23న మేడారం సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజై...