భారతదేశం, ఆగస్టు 2 -- విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం బంపర్ ఆఫర్ ఉంది. ప్రముఖ వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్ భారతీయులు అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. అట్లీస్ వన్ వే అవుట్ అనే పేరుతో వీసాను కేవలం 1 రూపాయికే ఇస్తామని వెల్లడించింది. వివిధ అంతర్జాతీయ గమ్యస్థానాలకు వీసాలను అందిస్తుంది. 15 దేశాలకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ లిస్టులో యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఈజిప్ట్, జార్జియా, ఒమన్, మెురాకో, ఖతర్, కెన్యా, తైవాన్ లాంటి దేశాలు ఉన్నాయి. రెండు రోజుల కార్యక్రమం ద్వారా భారతీయులకు కేవలం 1 రూపాయికే వీసా లభిస్తుంది. ఆగస్టు 4, 5 తేదీలలో అట్లీస్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అట్లీస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది....