భారతదేశం, మే 26 -- జ్యోతిష్య శాస్త్రంలో రాశి చక్రం ఎంత ముఖ్యమో, సంఖ్యా శాస్త్రంలో మూలాంకాలు కూడా అంతే కీలకం. సాధారణంగా మన సంప్రదాయంలో ఆడపిల్లలను సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. అయితే, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన మహిళలు అపారమైన అదృష్టవంతులని, వారి ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

గ్రహాల అనుకూలత, సత్ఫలితాల కారణంగా ఇలాంటి మహిళలు పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్లగానే, అక్కడ నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ఐశ్వర్యంతో పాటు సుఖసంతోషాలు ఆ ఇంట్లో వెల్లివిరుస్తాయి. మరి సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆ అదృష్టవంతులు ఎవరో, ఏ తేదీల్లో పుట్టిన వారు లక్ష్మీ స్వరూపాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28వ తేదీల్లో జన్మించిన మహిళల మూలాంకం 1 అవుతుంది. ఈ స...